కరోనా కేసుల్లో అమెరికా రోజుకో రికార్డు
అమెరికా కరోనా కేసుల్లో రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తోంది. శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 74,000 కేసులు నమోదయ్యాయి. వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. గత సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ వెయ్యి మంది అమెరికాన్లు సగటున చనిపోతున్నారు. ఒక్క ఫ్లోరిడాలోనే 12 వేల కొత్త కేసులు శనివారం నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,14,511కి చేరింది. ఈ కేసుల్లో ఆది న్యూయార్క్‌ను దాటి రెండో స్థానమాక్రమించింది. కాలిఫోర్నియా కన్నా ఫ్లోరిడా కొంచెం వెనకబడింది. గత కొద్ది వారాలుగా ఫ్లోరిడాలో కరోనా విజృంభిస్తోంది. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 5,777 మంది చనిపోయారు.






