యూనివర్సల్ పాస్ కమ్ సర్టిఫికెట్..
పూర్తిగా టీకాలు వేసిన పౌరులకు ప్రభుత్వం యూనివర్సల్ పాస్ కమ్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. రెండు మోతాదులో యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ పాస్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పాస్ ప్రజా రవాణా, కార్యాలయాలు, మాల్‌లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ప్రవేశం మొదలైన వాటికి ఉపయోగపడుతుంది. epassmsdma.mahait.org అనే సైట్ ద్వారా ఈ పాస్ ను పొందవచ్చు. సైట్‌ను తెరిచిన తర్వాత టీకా వేసేటప్పుడు ఇచ్చిన రిజిస్టర్డ్ సెల్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ఓటిపి వస్తుంది. దాని ద్వారా పాస్ కమ్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు.







