కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఈ మేరకు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, హోం క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలో తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే గడ్కరికీ కరోనా పాజిటివ్ రావడం ఇది రెండోసారి. ఆయనకు గతేడాది 2021 సెప్టెంబర్‌లో కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.