కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా
                                    కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ఆయన వెల్లడిరచారు. గత రెండు రోజులుగా అర్యోగం సరిగా లేకపోవడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఇటీవల నాతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కౌశాంబిలోని యశోద ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ల పర్యవేక్షణలో కొవిడ్ చికిత్స తీసుకుంటున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యంగా స్థిరంగా ఉందని పాడే ట్విటర్ ద్వారా వెల్లడించారు.







