కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. భారత్‌లో థర్డ్ వేవ్ కలకలం రేపుతోంది. సామాన్యుడి నుంచీ వీఐపీలకు వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని మంత్రి ట్విటర్ ద్వారా తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలున్నట్టు వెల్లడిరచారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయింంచుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.