టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. కోవిడ్ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పటల్ లో ఆయన చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. దీంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఎంపీగా విజయం సాధించిన వైవీ సుబ్బారెడ్డి.. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత టీటీడీ చైర్మన్గా నియమితులుయ్యారు.






