2024 నాటికి కూడా అంతటా అందదు
2024 ఏడాది చివరినాటికి కూడా ప్రపంచంలోని అన్ని దేశాల పౌరులకు వ్యాక్సిన్ అందటం కష్టమేనని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా చెప్పారు. ప్రపచంవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగైదేళ్లు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అందరికీ వ్యాక్సిన్ అందించడానికీ కనీసం 15 బిలియన్ డోసులు అవసరమవుతాయని చెప్పారు. సీరమ్ సంస్థలో తయారయ్యే వ్యాక్సిన్‌లో 50 శాతం డోసులను భారత్‌కే కేటాయిస్తామన్నారు. రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను తాము ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదిరే అవకాశముందని చెప్పారు. ఆస్ట్రాజెనెకా సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం 3 డాలర్ల ధరకే వ్యాక్సిన్ డోసును 68 దేశాలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం కోవాగ్జిన్‌ను 92 దేశాలకు ఉత్పత్తి చేస్తామన్నారు.






