గుడ్ న్యూస్… జూన్ చివరి నాటికి

కరోనా విజృంభణ కొనసాగిస్తున్న వేళ ఐఐటీ ఖరగ్‍పూర్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా సెకండ్ వేవ్‍తో సతమతం అవుతున్న దేశం త్వరలోనే కోలుకోనున్నది. జూన్ చివరినాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95 శాతం తగ్గునున్నాయి. ఐఐటీ ఖరగ్‍పూర్‍కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేసిన సూత్ర మ్యాథమెటికల్ మోడల్ ఈ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలోనూ జూన్ చివరినాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 90 శాతం పడిపోనున్నట్లు తెలిసింది. దేశంలో కొవిడ్ గమణం ఎలా సాగుతోందన్న దానిపై గతంలోనూ స్పష్టమైన అంచనాలు వేసింది. దేశంలో పాజిటివ్ కేసులు రోజు వారి సగటు సంఖ్య 15 వేలకు చేరుకుంటుందని పేర్కొన్నది. అయితే జూన్ చివరి నాటికి ఈ సగటు సంఖ్య నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిరోజు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంఖ్య 15 వేలకు చేరడం అంటే ఇది చాలా పాజిటివ్ అంశమే.