పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా పాజిటివ్

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి కరోనా సోకింది. ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నై లోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందేవుకు వెళ్లారు.