భారత్‍కు 5 కోట్ల టీకాలు!

భారత్‍కు 5 కోట్ల కోవిడ్ టీకాలు అందించేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఆ టీకాలు సరఫరా అయ్యే ఛాన్సు ఉన్నది. అయితే కేవలం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఫైజర్ టీకాలను కొనుగోలు చేయాలని చూస్తున్నది. వ్యాక్సిన్ల కొరత ఉన్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్తున్న విషయం తెలిసిందే. అమెరికా ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ దేశం ఆ రెండు టీకాలను ఇతర దేశాలకు ఇచ్చేందుకు ఇంకా సుముఖంగా లేదు. అమెరికాలో పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ జరిగిన తర్వాతనే ఇతర దేశాలకు టీకాలను అమ్మేందుకు ఆ దేశం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.