అమెరికా కంపెనీలు కీలక ప్రకటన
ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో ఇప్పటికే కరోనా కేసులు 8 మిలియన్లు దాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ 3న జరిగే ఎన్నికల నాటికి కరోనా వ్యాక్సిన్లు సిద్ధమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే వ్యాక్సిన్ విషయంలో తాను సిద్ధంగా ఉన్నట్లు ఫైబర్, మోడెర్నా ప్రకటించాయి. అమెరికన్ వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కోవిడ్ 19 వ్యాక్సిన్ల అత్యవసర ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నాయి. అయితే అత్యవసర అనుమతి వచ్చిన తర్వాత ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.
మసాచుసెట్స్ బయోటెక్ సంస్థ మోడెర్నా నవంబర్ 25 నాటికి టీకా ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ చైర్మన్, సీఈఓ అల్బర్ట్ బౌర్లా ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా ఏడాది చివరికల్లా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ మూడో వారంలో టీకాలు ఆమోదం పొందినప్పటికీ అవి విస్తతంగా లభించడానికి కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే అత్యవసర ఆమోదం పొందినా అవి ఎంతమాత్రం పనిచేస్తాయోనని మరికొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.






