వచ్చే ఏడాదికి కరోనాకు.. ఓరల్ ఔషధం

వచ్చే ఏడాదిలో కరోనాకు నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని అందుబాటులోకి తెస్తామని ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా ప్రకటించారు. ప్రస్తుతం రెండు యాంటీ వైరల్ ఔషధాలపై తాము పరిశోధనలు చేస్తున్నామని, అందులో ఒకటి ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) ఔషధం కాగా ఇంకొకటి ఇంజెక్షన్ అని ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుత ప్రాధాన్యాల దృష్ట్యా తాము ఓరల్ ఔషధంపైనే ఎక్కువగా పని చేస్తున్నామన్నారు.