21 లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ : సీడీసీ

అమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసును 21,27,143 మందికి వేసినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం.. కరోనా వైరస్‍కు 19.2 శాతం మంది పాజిటివ్‍గా పరీక్షించగా.. 3.34లక్షల మందికి పైగా మరణించారు. అమెరికాలో వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతున్నందున, యూరోపియన్ యూనియన్‍లోని దేశాలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ స్వల్ప లాజిస్టికల్ సమస్య కారణంగా ఆలస్యమైందని ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు ఫైజర్ అండ్ బయోఎన్ టెక్ ప్రకటించాయి. మా డెలివరీలను పరిమిత సంఖ్యలో రీషెడ్యూల్ చేశాం. లాజిస్టికల్ సమస్య పరిష్కారమైంది. ఆ డెలివరీలు ఇప్పుడు బట్వాడా చేయబడుతున్నాయి అని, తయారీ సమస్యలు ఏవీ లేవని అని ఫార్మాస్యూటికల్ దిగ్గజం తెలిపింది.