అందుబాటులోకి మరో కరోనా ఔషధం!

కరోనా రోగుల చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‍కు చెందిన ఆప్టిమస్ ఫార్మ అభివృద్ధి చేసిన మోల్నుపివర్ మూడో దశ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. తేలికపాటి, మధ్యస్థ కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి మోల్ను పివర్ ఔషధం బాగా పనిచేస్తుందని ఆప్టిమస్ ఫార్మ చైర్మన్ డా.డీ. శ్రీనివాస్‍రెడ్డి తెలిపారు. అయిదు రోజుల్లోనే మోల్పు పివర్‍తో కోవిడ్ వైరస్ లోడ్ 0.0 శాతానికి చేరినట్లు ఫలితాలు వచ్చాయన్నారు. ఆప్టిమస్ ఫార్మా అత్యంత విజయవంతమైన సార్స్కోవ్-2 యాంటీవైరల్ ఔషధ తయారీ సంస్థల్లో ఒకటని పేర్కొన్నారు.