అమెరికాలో పది లక్షల మందికి కొవిడ్ టీకా
అమెరికాలో ఇప్పటి వరకు పది లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ తెలిపారు. పది రోజులు కిందట టీకా పంపిణీ ప్రారంభం కాగా, మొదటి విడత మోతాదును మిలియన్ జనాభాకు వేసినట్లు రెడ్‌ఫీల్డ్ తెలిపారు. అదే సమయంలో టీకా అందరికీ అందుబాటులోకి వచ్చే వరకు ఫేస్‌మాస్క్ లు ధరించడంతో పాటు నిబంధనలు పాటించాలని ఆయన అమెరిక్లను కోరారు. ఇటీవల ఎఫ్‌డీఏ ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరి వరకు పది మిలియన్ల జనాభాకు రెండు వ్యాక్సిన్ లు పంపిణీ చేయాలని యూఎస్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఫైజర్, మోడెర్నా నుంచి వందల మిలియన్ల మోతాదులను ఆర్డర్ చేశారు. ప్రస్తుతం మొదటి విడత డోసు ఇస్తుండగా కొద్ది రోజుల తర్వాత బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.






