కొవిడ్ పై నానో వ్యాక్సిన్
తాము అభివృద్ధి చేసిన నానోపార్టికల్ కరోనా వ్యాక్సిన్ గణనీయ స్థాయిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్లు అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎలుకలపై దీనిని ప్రయోగించగా కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల కంటే వాటిల్లో 10 రెట్లు ఎక్కువగా యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు చెప్పారు. వ్యాక్సిన్ డోస్‌ను కూడా 6 రెట్లు తక్కువగానే ఇచ్చినట్లు చెప్పారు. వ్యాక్సిన్ ప్రభావం సుదీర్ఘ కాలం కొనసాగడంలో కీలకమైన బీ సెల్ ప్రతిస్పందన కూడా మెరుగ్గా ఉన్నట్లు వివరించారు. క్లినికల్ ట్రయల్స్ కోసం ఈ వ్యాక్సిన్‌ను రెండు కంపెనీలకు అందించినట్లు తెలిపారు.






