కరోనావైరస్ వ్యాక్సిన్ కు అత్యవసర ఆమోదం దాఖలు చేసిన మోడెర్నా
అమెరికా కరోనావైరస్ కారణంగా క్రమంగా ఆరోగ్య సంక్షోభంలో పడుతుందేమో అని ఆందోళనలో ఉండగా మోడెర్నా సంస్థ ఆశాజనక వార్తను ప్రకటించింది. ఔషధ తయారీ దిగ్గజం మోడెర్నా 30 నవంబర్ 2020 సోమవారం మోడెర్నా తయారుచేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రయోగాలపై చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది.మోడెర్నా నుండి వచ్చిన కొత్త డేటా ప్రకారం మోడెర్నా కరోనావైరస్ వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి 30,000 పైచిలుకు మంది తో మోడెర్నా చేసిన అధ్యయనం లో మోడెర్నా తయారు చేసిన కరోనావైరస్ వ్యాక్సిన అవసరమైన శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చూపిస్తుంది. నవంబర్ 16 2020 న విడుదల చేసిన తాత్కాలిక డేటా యొక్క విశ్లేషణతో పూర్తి డేటా సమితి నుండి కనుగొన్న విషయాలు వ్యాక్సిన 94.5 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు.
మోడెర్నా తయారు చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రజల పై ఉపయోగించడానికి అత్యవసర ఆమోదం కోసం మోడెర్నా సంస్ధ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు (F.D.A) సోమవారం 30 నవంబర్ 2020 న దరఖాస్తు చేశానని, మోడెర్నా కరోనావైరస్ వ్యాక్సిన్ ఆమోదం పొందితే అమెరికన్లకు కరోనావైరస్వ్యాక్సిన్ ఇవ్వడం డిసెంబర్ 21 నుండే ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది.ఇప్పటిదాకా 13.3 మిలియన్ల అమెరికన్లు COVID-19 బారిన పడ్డారు మరియు 265,900 మందికి పైగా మరణించారు. నవంబరు నెలలో మాత్రమే అమెరికాలో నాలుగు మిలియన్లకు పైగా కొత్త కరోనావైరస్ కేసులు మరియు 25,500 కరోనావైరస్ మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 62 మిలియన్ల కరోనావైరస్ కేసులు మరియు దాదాపు 1.5 మిలియన్ల కరోనావైరస్ మరణాలు సంభవించాయి అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.
ఫైజర్ నవంబర్ 20 న తన దరఖాస్తును సమర్పించగా మోడెర్నా అత్యవసర వినియోగ అధికారం కోసం దరఖాస్తు చేసిన రెండవ వ్యాక్సిన్ తయారీదారు. అయితే కరోనావైరస్ వ్యాక్సిన్ యొక్క మొదటి విడుదల ఎవరికి కేటాయించాలో నిర్ణయించడానికి మంగళవారం 1st నవంబర్ 2020 న సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సలహాదారుల బృందం సమావేశం అవ్వనున్నది.






