కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ ఈ వైరస్ వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఖర్గే నమూనాలను ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం పంపగా పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఖర్గే కార్యదర్శి రవీంద్ర గరిమెళ్ళ తెలిపారు. గత రెండు రోజులుగా ఖర్గేతో పరిచయం ఉన్నవారు తమ లక్షణాలను గమనించి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమను తాము పరీక్షించుకోవాలని ఆయన సూచించారు. ఖర్గే రెండు డోసులు తీసుకున్నారు. అయితే బూస్టర్ డోసు తీసుకునేందుకు ఆయన అర్హులు కాదు. ఎందుకంటే బూస్టర్ డోసు తీసుకోవాలంటే రెండో డోసు నుంచి కనీసం తొమ్మిది నెలల గ్యాప్ అవసరం.