దేశంలో కొత్తగా 23,950 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 23,950 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మంగళవారం కేసుల సంఖ్య తగ్గగా, బుధవారం సుమారు నాలుగువేలకు పైగా కేసులు పెరిగాయి. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,99,066కు పెరిగింది. మహమ్మారి నుంచి తాజాగా 26,895 మంది కోలుకోగా ఇప్పటి వరకు 96,63,382 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 333 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 1,46,444కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,89,240 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా మంగళవారం దేశవ్యాప్తంగా 10,98,154 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటి వరకు 16,42,68,721 టెస్టులు చేసినట్లు పేర్కొంది.