గుడ్ న్యూస్…దేశంలో రోజురోజుకు తగ్గుతున్న కేసులు

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,52,734 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534 కు పెరిగింది. గత 24 గంటల్లో 3,128 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,29,100కు చేరింది. దేశంలో మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,56,92,342కు పెరిగింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 20,26,092కు చేరింది. గత 24 గంటల్లో 2,38,022 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 21,31,54,129 మందికి కరోనా టీకా పంపిణీ చేశామని తెలిపింది.