24 గంటల్లో 81,466 కేసులు..

దేశంలో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా రెండ దశ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో 11,13,966 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 81,466 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,03,131 చేరింది. గడిచిన 24 గంటల్లో 469 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం 1,63,396 మంది ఈ మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 6,14,696కి చేరింది. క్రియాశీల రేటు 4.78 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో 1.25 శాతానికి తగ్గిన క్రియాశీల రేటులో ఇప్పుడు భారీ పెరుగుదల కనిపిస్తుడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్లిష్ట సమయంలో కొవిడ్ నుంచి కోలుకునే వారి గణాంకాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 50,356 మంది వైరస్‍ను జయించారు. మొత్తం రికవరీలు 1.15 కోట్లు దాటగా.. ఆ రేటు 93.89 శాతానికి తగ్గింది. టీకా డ్రైవ్‍లో ఇప్పటి వరకు 6,87,89,138 డోసులు వేసినట్లు వివరించింది. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులతో కేంద్రం అప్రమత్తమైంది.