దేశంలో కరోనా విలయ తాండవం ..

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,04,698 మందికి పరీక్షలు నిర్వహించగా.. 3,68,147 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,99,25,604గా ఉంది. 3,417 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 2,18,959కి చేరింది. 1,62,93,003 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,13,624 కేసులు యాక్టివ్‍గా ఉన్నాయి. గత 24 గంటల్లో 15,04,698 కోవిడ్ పరీక్షలు జరిగాయి. దేశంలో 10 రోజులకు పైగా రోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 15,71,98,207 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 56,647 కేసులు ఉండగా, కర్ణాటకలో 37,773, కేరళలో 31,959 చొప్పున నమోదయ్యాయి.