దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..మూడు వేలకు పైనే

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా మరోమారు మూడు వేలకు పైగా బాధితులు మరణించారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,20,107 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 3,86,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976కు చేరింది. ఇందులో 1,53,84,418 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా 31,70,228 కేసులు యాక్టివ్‍గా ఉన్నాయి. కొత్తగా 3498 మంది మృతి చెందారు. దీంతో 2,08,330 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు 2,97,540 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 15,22,45,179 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.