దేశంలో రెండు కోట్లు దాటిన కేసులు…

భారత్‍లో కరోనా వైరస్ రెండో దశ అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3,449 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 3,20,289 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కు పెరిగింది. ఇప్పటి వరకు 1,66,13,292 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 2,22,408 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‍లో భాగంగా 15,89,32,921 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికాలో 3.24 కోట్లు కేసులు నమోదవ్వగా.. రెండు కోట్ల మార్క్ను దాటిన దేశం భారత్ కావడం గమనార్హం.