రికవరీ రేటులో భారత్ దే అగ్రస్థానం

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ప్రభుత్వాలకు ఊరటనిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 9,35,369 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,139 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,13,417 కి చేరింది. కొద్ది రోజుల క్రితం 16 వేలకు వరకు పడిపోయిన కేసుల సంఖ్యలో నిన్నటి నుంచి కాస్త పెరుగుదల కనిపిస్తోంది. ఎప్పటిలాగే క్రియాశీల కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 2,25,449గా ఉంది. క్రియాశీల రేటు 2.16 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 96.39శాతానికి పెరిగింది.
భారత్‌లో రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యధికమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ తరవాత బ్రెజిల్, రష్యాలో రికవరీ రేటు మెరుగ్గా ఉందని తెలిపింది. అలాగే దేశంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,00,37,398గా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో 234 మంది కరోనాతో మృత్యుఒడికి చేరుకోగా, 1,50,570 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.