దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా 16 వేలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,311 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,66,595కు చేరాయి. ఇందులో 1,00,92,909 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,22,526 కేసులు యాక్టివ్‍గా ఉన్నాయి. మరో 1,51,160 మంది మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 19,299 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారి నుంచి బయటపడ్డారు. కొత్తగా 161 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో నిన్నటి వరకు 18,17,55,831 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఇందులో జనవరి 10న 6,59,209 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.