వారికి తొమ్మిది నెలల తర్వాత.. టీకా

కరోనా నుంచి కోలుకున్న వారికి తొమ్మిది నెలల తర్వాత టీకా ఇవ్వాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‍టీఏజీఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని సిఫారసు చేసిన ఈ కమిటీ తాజాగా దానిని 9 నెలలకు పెంచింది. దీనిపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నది. వ్యవధి పెంచడం ద్వారా శరీరంలో యాంటీబాడీలు మరింత వృద్ధి చెందుతాయని ప్యానెల్ చెబుతున్నది. కరోనా నుంచి కోలుకున్న వారు ఆరునెలల తర్వాత టీకా వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) సూచిస్తున్నది.