గూగుల్ మరో కీలక నిర్ణయం

ఉద్యోగుల భద్రత కోసం ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రతి గూగుల్ ఉద్యోగికి ఉచితంగా కరోనా టెస్టులు చేయిస్తామని ప్రకటించింది. వారానికి ఒకసారి ప్రతి ఉద్యోగి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా వచ్చే ఏడాది నుంచి ప్రపంచంలోని గూగుల్ ఉద్యోగులందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. గూగుల్ తాజా నిర్ణయంతో అమెరికాలో దాదాపు 90 వేల మంది ఉద్యోగులకు తక్షణం లాభం చేకూరనుంది. టెస్టుల కోసం ఉద్యోగుల ఇంటి వద్దే శాంపిళ్ల సేకరించి ల్యాబుల్లో పరిక్షిస్తారని సమాచారం. అయితే ఈ పరిక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని నిబంధన ఏమీ లేదని కూడా కంపెనీ సృష్టం చేసింది.