కొవిడ్ చికిత్సకు నాజల్ స్ప్రే

కొవిడ్ 19 చికిత్స కోసం నాజల్ స్ప్రై అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఔషధ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫాబిస్ప్రే పేరుతో దీనిని విడుదల చేసింది. కొవిడ్‌తో బాధపడుతున్న వయోజనులకు ఈ స్ప్రై అందించవచ్చని తెలిపింది. కెనడాకు చెందిన సనోటైజ్ ఫార్మా సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రైను భారత్‌లో తయారీ, మార్కెట్ చేసుకునేందుకు గ్లెన్‌మార్క్ ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నాజల్ స్ప్రై తీసుకున్న 24 గంటల్లో 94 శాతం వైరల్ లోడ్ తగ్గుతుండగా, 48 గంటల్లో 99 శాతం తగ్గుతున్నట్లు భారత్‌లో జరిపిన మూడోదశ ప్రయోగాల్లో వెల్లడైంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రే సురక్షితమే కాకుండా కొవిడ్ బాధితులకు ఎటువంటి దుష్రభావాలు తలెత్తడం లేదు. ఫాబిస్ప్రే పేరుతో దీన్ని మార్కెట్‌లోకి అందుబాటులోకి తెస్తున్నాం అని గ్లెన్‌మార్క్ ఫార్మ సంస్థ వెల్లడిరచింది.