భారత్ బయోటెక్‍కు భారీ షాక్….

దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్‍కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. సంస్థ అభివృద్ధి చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‍డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించిన భారత్ బయోటెక్, యూఎస్ భాగస్వామ్య కంపెనీ ఆక్యుజెన్‍తో ప్రతిపాదనలను బైడెన్ సర్కార్ నిరాకరించింది. మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్ కోవాగ్జిన్‍ను చేర్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కూడా భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శలు సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.