గుడ్ న్యూస్…మరో ఔషధానికి అనుమతి

కరోనా మహమ్మారీని ఎదుర్కోవడానికి మరో ఔషధ వినియోగానికి అనుమతి లభించింది. కరోనా తీవ్రత తక్కువగా ఉండే కోవిడ్ 19 ఇన్‍ఫెక్షన్ల చికిత్స కోసం యాంటీవైరల్ డ్రగ్ విరాఫిన్‍ను ఉపయోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి లభించినట్లు జైడస్ కాడిలా ప్రకటించింది. తక్కువ స్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా దీన్ని అందిస్తారు. ఇప్పటికే తీవ్ర కరోనాతో బాధపడేవారికి రెమ్‍డెసివర్ ఇంజక్షన్‍ను అందిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ నిర్థారణ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు ప్రారంభ దశలోనే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వైరల్ లోడ్‍ను గణనీయంగా తగ్గించవచ్చని సంస్థ ఎండీ డాక్టర్ శార్విల్ పటేల్ పేర్కొన్నారు. కరోనా రోగులకు క్లిష్టమైన సమయంలో ఈ ఔషధం ఎంతగానో ఉపయోపగడుతుందని భావిస్తున్నామన్నారు.