జనవరిలో కరోనా టీకా పంపిణీ!
అమెరికాలో వచ్చే ఏడాది జనవరి నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభమవుతుందని యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్టుమెంట్ సెక్రెటరీ రాబర్ట్ కాడెక్ వెల్లడించారు. పంపిణీకి సంబంధించిన అనుమతులు ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశముందన్నారు. దీనికి అనుగుణంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంత చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ఈ ఏడాదిలోపే వ్యాక్సిన్ తీసుకురావడానికి ట్రంప్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నదని అన్నారు. కాగా రాబోయే శీతాకాలంలో కరోనా విజృంభణ కొనసాగే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.






