ప్రపంచంలోనే భారత్ మరో మైలురాయి

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో కరోనా టీకాల పంపిణీ వంద కోట్ల డోసుల మార్కును చేరింది. ఇప్పటివరకు బిలియన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. దీంతో చైనా తర్వాత బిలియన్ డోసులు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని మొత్తం 94.4 కోట్ల మంది వయోజనులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఈ ఏడాది జనవరి 16న దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. ఇప్పటి వరకు 75 శాతం వయోజనులు మొదటి డోసును, 31 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ఈ నెలలో రోజుకు సరాసరి 50 లక్షల మంది వ్యాక్సిన్ పంపిణీ చేశారు.