భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి

భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసకుంది. 2-18 ఏండ్ల వయస్కులవారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ను జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నది. దేశవ్యాప్తంగా 525 మంది బాలలపై ప్రయోగాలు జరుపనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ప్రయోగాలు త్వరగా పూర్తయ్యి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పిల్లలకు కొవాగ్జిన్ టీకా వేసేందుకు అనుమతులు వస్తాయని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లలపై కొవాగ్జిన్ ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ కు ఇటీవలే కేంద్రం అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.