భారత్ బయోటెక్ కీలక ప్రకటన…

కొత్త రకం కరోనా వైరస్ కేసులో భారత్‌లో పెరుగుతున్న నేపథ్యంలో టీకా తయారీదారు భారత్ బయోటెక్ కీలక విషయాన్ని ప్రకటించింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ బ్రిటన్‌లో కలకలం రేపిన కొత్త రకం ప్రాణాంతక కరోనా వైరస్‌పై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ట్వీట్ చేసింది.
చైనాలోని వూహాన్‌లో పుట్టిన కోవిడ్-19 కంటే 70 శాతం ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు భావిస్తున్న బ్రిటన్ కొత్త వేరియంట్ వైరస్‌ను తమ వ్యాక్సిన్ కోవాగ్జిన్ విజయవంతంగా నిలువరిస్తోందని వెల్లడించింది. దీనికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన లింక్‌ను షేర్ చేసింది. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని ఇటీవల బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అనేక దేశాలో విదేశీయాన ఆంక్షలను కూడా విధించాయి. అయితే ఇప్పటికే బ్రిటన్ నుంచి విమానాల ద్వారా ఇండియాకు చేరిన వారిలో 150 మంది కొత్త కోవిడ్ స్ట్రెయిన్ బారిన పడ్డారు.