కరోనా భయంతో పిల్లలు వద్దనుకుంటున్న దంపతులు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా లక్షల సంఖ్యలో మరణాలకు కారణమవుతోంది.. ఉన్న జనాభా ని పొట్టన బెట్టుకోవడంతో పాటు రానున్న జనాభా ని సైతం అడ్డుకుంటోంది. కరోనా కారణంగా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ప్రెగ్నెన్సీ ని వాయిదా వేస్తున్నారు. ఈ విషయం. జర్నల్ ఆఫ్ సైకో సోమాటిక్ గైనకాలజీ రిపోర్ట్ వెల్లడించింది. కరోనా ఒకటే కారణాలెన్నో… ఇలా పిల్లలు వద్దనుకుంటున్న దంపతులలో రకరకాల భయాలు ఉన్నట్టు రిపోర్ట్ తేల్చింది.
కరోనా కారణంగా గర్భం వద్దనుకుంటున్న 81 శాతం కాగా గర్భం దాల్చాక కరోనా వస్తే ఎలా అనే ఆందోళన తో 73 శాతం వద్దనుకుంటున్నారు. మరోవైపు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 88 శాతం దంపతులు ప్రెగ్నెన్సీ కి నో అంటున్నారు.






