తెలంగాణలో కొత్తగా 1,718 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,97,327కు చేరింది. అలాగే 1,153 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 28,328 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 1,67,846 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 31.53 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. కొత్తగా జీహెచ్ఎంసీలో 285, రంగారెడ్డిలో 129, మేడ్చల్లో 115, కరీంనగర్లో 105 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 85.05గా ఉంది.






