తెలంగాణలో కొత్తగా 2,103 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,91,386 కరోనా కేసులు నమోదు కాగా, 1,127 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29,326 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,880 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. చికిత్స నుంచి కోలుకుని 1,60,933 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 29.96 లక్షల కరోనా టెస్టులు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా కొత్త జీహెచ్ఎంసీ పరిధిలో 293, మేడ్చల్ 176, రంగారెడ్డి 172, నల్గొండ 141 కరోనా కేసులు నమోదయ్యాయి.






