ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 71,577 నమూనాలు పరీక్షించగా 6,751 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 41 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 7 మంది, కృష్ణా 6, ప్రకాశం 5, విశాఖపట్నం 5, అనంతపురం 4, తూర్పుగోదావరి 4, గుంటూరు 3, కడప 3, పశ్చిమగోదావరి 2, నెల్లూరు, శ్రీకాకుళం ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,869కి చేరింది. 24 గంటల వ్యవధిలో 7,297 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 58,78,135 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం 57,858 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.






