వయసు మళ్ళిన వాళ్ళ పైనే కోవిడ్-19 ప్రమాదం ఉంటుంది అనుకుంటే పొరపాటు: యువతకు హార్వర్డ్ హెచ్చరిక
కరోనావైరస్ వృద్ధులపై నే తీవ్ర ప్రభావం చూపుతుంది అని ఇప్పటివరకు భావిస్తున్న యువత ను కరోనావైరస్ పై హార్వర్డ్ విడుదల చేసిన పరిశోధన లేఖ తీవ్రమైన షాక్ కు గురిచేసింది. కరోనావైరస్ పై హార్వర్డ్ విడుదల చేసిన పరిశోధనా లేఖలో కరోనావైరస్ తో ఆసుపత్రిలో చేరిన 3,222 మంది యువకులలో 2.7 శాతం అంటే సుమారుగా 88 మంది మరణించారు అని వెల్లడించింది. అంతే కాక ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు మరియు ప్రతి 10 మంది లో ఒకరికి శ్వాసక్రియ కు సహాయపడటానికి వెంటిలేటర్స్ ని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. 3,222 మంది యువకులలో ప్రాణాలతో బయటపడిన వారిలో 3 శాతం అంటే 99 మంది రోగులని డిప్రషన్ కారణంగా ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి నుండి ఇంటికి పంపించకుండ కోవిడ్-19 పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.
కోవిడ్ -19 తో ఆసుపత్రిలో చేరిన యువ రోగులలో దాదాపు 60 శాతం మంది పురుషులు మరియు 60 శాతం మంది బ్లాక్ లేదా హిస్పానిక్ వారు కావడం విశేషం.అయితే మహిళల కంటే ఎక్కువ శాతం పురుషులకు వెంటిలేటర్ అవసరం పడుతుంది అని, చనిపోయిన వారిలో మరియు చనిపోయే అవకాశం కూడా పురుషులకే ఎక్కువగా ఉంది అని తెలిపింది.
కోవిడ్-19 సోకినా చనిపోయిన యువతలో ఎక్కువ శాతం మంది కి డయాబెటిస్ ,ఒబిసిటీ మరియు రక్తపోటు ఉండడం మే కారణంగా పేర్కొనటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సామాజిక దూరం, ముఖాన్ని కప్పి ఉంచడం మరియు ఇతర నియమాలు యువతకు మరియు వయసు మళ్ళిన వాళ్ళు పాటించడం చాలా అవసరం అని జమ ఇంటర్నల్ మెడిసిన్ డిప్యూటీ ఎడిటర్ డాక్టర్ మిట్చెల్ కట్స్ తెలిపారు.






