దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు ..
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మరోసారి రోజువారీ కేసులు పెరిగాయి. 24 గంటల్లో కొత్తగా 41,195 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 39,069 మంది బాధితులు కోలుకోగా మరో 490 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది. ఇందులో మొత్తం 3,12,60,050 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 4,29,669 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 48.73 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.







