కొత్త వేరియంట్లతో జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

అంతర్జాతీయంగా కోవిడ్ నూతన వేరియంట్ల నమోదు నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాసారు. కొవిడ్ బి 1.1529 వేరియంట్ బోట్స్వానా దేశంలో 3, దక్షిణాఫ్రికాలో 6, హాంకాంగ్‌లో ఒక కేసు నమోదయ్యాయని వెల్లడైంది. ఈ వేరియంట్ గణనీయమైన సంఖ్యలో ఉత్పరివర్తనలు ఉన్నట్లు నివేదించబడినట్లు లేఖలో తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ, ఇటీవల సడలించిన వీసా పరిమితుల దృష్ట్యా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
అందువల్ల ఈ దేశాల నుండి ప్రయాణించే లేదా ఈ దేశాల గుండా భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ ప్రమాదంలో ఉన్న దేశం జాబితాలో ఉంటారని స్పష్టం చేసింది. ఈనెల 11 నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ దేశాల నుంచి వచ్చే వారి కఠినమైన స్కినింగ్, పరీక్షలను లోబడి ఉంటారు. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ అంతర్జాతీయ యాత్రికుల కాంటాక్స్‌ను నిశితంగా ట్రాక్ చేయాలి. అవసరమైతే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.