కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ బయోటెక్ మరో అడుగు

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ బయోటెక్ కంపెనీ మరో అడుగు ముందుకు వేసింది. సంస్థ తయారు చేసిన చుక్కల మందు బూస్టర్ డోస్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ట్రయల్స్ 900 మందిపై నిర్వహించేందుకు నిర్ణయించారు. ఒమిక్రాన్ దేశ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నది. ఈ సమయంలో బూస్టర్ డోస్ ఎంతో కీలకంగా మారింది. ఫేజ్`3 బూస్టర్ డోసులో భాగంగా ఈ చుక్కల మందు టీకాకు డీసీజీఐ నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చుక్కల మందు రూపంలో అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. ఫేజ్`3 బూస్టర్ డోస్ కోసం దరఖాస్తు చేసుకున్న రెండో కంపెనీగా భారత్ బయోటెక్ నిలిచింది.