త్వరలో ముక్కు ద్వారా టీకా

భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ముక్కు ద్వారా వేసే కొవిడ్ టీకాకు త్వరలో ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తో పాటు ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియర్ సైన్సెస్, గురునానక్ ఆస్పత్రి, హర్యానాలోని ఇన్‍క్లెన్ ఆస్పత్రిలో ఆ ట్రయల్స్ చేపట్టనున్నారు. రెండు, మూడు దశల ట్రయల్స్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఎథిక్స్ కమిటీ అనుమతించిన తరువాతనే ట్రయల్స్ ప్రారంభం అవుతాయి. ముక్కు ద్వారా వేసే టీకాకు తొలిదళ క్లినికల్ ట్రయల్స్ జూన్‍లో ముగిసింది. 18 నుంచి 60 ఏళ్ల మధ్య హెల్లీ వాలంటీర్లలో ఆ ట్రయల్స్ ను భారత్ బయోటెక్ నిర్వహించింది.