భారత్ బయోటెక్ కు గ్రీన్ సిగ్నల్..

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసేందుకు అనుమతి లభించిన నేపథ్యంలో చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 1, ఫేజ్ 2 నిర్వహించేందుకు భారత్ బయోటెక్‍కు నిపుణుల ప్యానెల్ ఆమోదం తెలిపింది. 2 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలపై ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్‍కు చెందిన భారత్ బయోటెక్ సమర్పించిన దరఖాస్తుపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‍సిఒ) లోని కోవిడ్-19పై సబ్జెక్ ఎక్స్ఫర్డ్ కమిటీ (ఎస్‍ఈసీ) చర్చించింది. ఢిల్లీ ఎయిమ్స్, పాట్నా ఎయిమ్స్, నాగ్‍పూర్‍లోని మెడిట్రినా ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‍తో పాటు వివిధ ప్రాంతాల్లో 525 సజ్జెక్టులపై పరీక్షలు చేపట్టనుంది. చర్చల అనంతరం రెండు దశల ట్రయల్స్ కు కోవాగ్జిన్‍కు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.