కరోనా రిసెప్టర్ ను కట్టేసే ప్రొటీన్
శరీర కణాలపై ఉండే రిసెప్టరే కరోనా చొరబాటుకు ముఖ్యద్వారం. ఆ రిసెప్టర్‌లోకి ప్రవేశించకుండా వైరస్‌కు ఆరోప్రాణమైన స్పైక్ కట్టేయగల యాంటీవైరల్ ప్రొటీన్ ఒకదాన్ని అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ ప్రొటీన్ ఇంజనీరింగ్ విభాగం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దాని పేరు ఎల్సీబీ1. అధ్యయనంలో భాగంగా స్పైక్ ప్రొటీన్‌ను బంకలా బంధించగల 1.18 లక్షలపైగా కృత్రిమ ప్రొటీన్లను కంప్యూటర్ డిజైనింగ్ ద్వారా రూపొందించారు. ప్రయోగశాల లోని మానవ కణజాలంలోకి వాటిని ప్రవేశపెట్టి పరీక్షించగా, ఎల్సీబీ1, ప్రొటీన్ సమర్థంగా పనిచేసినట్లు వెల్లడైంది.






