24 గంటలో 86,821 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,12,585కి చేరింది. వైరస్బారినపడి ఇప్పటి వరకు 98,678 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 85,376గా నమోదు అయ్యింది. ఇప్పటి వరకు 52,73,201 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 9,40,705 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 83.53 శాతంగా నమోదైంది. మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.56 శాతానికి తగ్గింది. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 14,23,052 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు మొత్తం 7,56,19,781 పరీక్షలు చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ జారీ చేసింది.






