తెలంగాణలో కొత్తగా 2,009 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 293 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,95,609 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1145కు చేరింది. ఇవాళ 2437 మంది చికిత్సకు కోలుకొని ఇండ్లకు వెళ్లగా మొత్తం 1,65,844 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 28,320 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, హోం ఐసోలేషన్‌లో 23,372 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతం ఉండగా రికవరీ రేటు 84.78 గా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 54,098 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా మొత్తం 31,04,542 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.






