హౌస్టన్ లో వైస్సార్సీపీ కార్యకర్తలు సభ
హౌస్టన్ మహానగరము లో వైస్సార్సీపీ కార్యకర్తలు అందరు ఒక చోట చేరి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కార్యకర్తలు అందరు ముక్త కంఠము తో శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి పట్టుదలను మరియు మొక్కవోని ధైర్యాన్ని కొనియాడారు. పాదయాత్ర లో దాదాపు 14 నెలలు అయన పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. అందరు రాబోయే ఎన్నికలు గురుంచి, పార్టీ కి ఎలా తోడ్పడు అందించాలి అనే అంశాన్ని చాలా సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే కార్య క్రమాల ప్రణాలికను కూడా చర్చించారు. తరువాత అందరు కేక్ కట్ చేసి, జోహార్ వైస్సార్, జై జగన్, రావాలి జగన్ కావాలి జగన్ నినాదాలతో హోరెత్తించారు.













