ధూమపానం మన్పించే మొబైల్ యాప్
ధూమపాన అలవాటును మాన్పించడంతోపాటు, దాని వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలను పసిగట్టి మనకు చెప్పే సరికొత్త మొబైల్ యాప్ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. గెరో హెల్త్స్పాన్ అనే ఈ యాప్ సాయంతో పొగ తాగడం వల్ల శరీరంలో జరిగే మార్పులను ఏ రోజుకా రోజు తెలుసుకోవచ్చని వారు తెలిపారు. అంతే కాకుండా రోజువారి ఫలితాలను బట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందో, ఆ అలవాటు ఎలా మానుకోవాలో ఈ గెరో హెల్త్స్పాన్ చెబుతుందని దాన్ని తయారు చేసిన రోస్వెల్ పార్క్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు.













